Category

తాజా వార్తలు

Main category

12 articles published

Guntur: వైజర్ గ్లోబల్ సమ్మర్ ప్రోగ్రామ్‌లో ‘క్వాంటమ్ ఎలైట్’గా చైత్ర దీపిక
తాజా వార్తలుOct 1, 2026

Guntur: వైజర్ గ్లోబల్ సమ్మర్ ప్రోగ్రామ్‌లో ‘క్వాంటమ్ ఎలైట్’గా చైత్ర దీపిక

గుంటూరు జిల్లా వింజనంపాడులోని కిట్స్ కళాశాల బీటెక్ విద్యార్థిని గంట చైత్ర దీపిక ‘వైజర్ గ్లోబల్ సమ్మర్ ప్రోగ్రామ్–2026’లో ‘క్వాంటమ్ ఎలైట్’గా ఎంపికయ్యారు. 33 దేశాల నుంచి 64,436 మంది నమోదు చేసుకున్న ఈ కార్యక్రమంలో తుది దశలో ఎంపికైన 10 మందిలో ఆమె చోటు సంపాదించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా రూపొందించిన ‘క్వాంటమ్‌ఫ్లో ఇంటెలిజెంట్ ఆర్డర్ ఆప్టిమైజేషన్’ ప్రాజెక్ట్‌ను కూడా ఆమె ప్రదర్శించారు.

1 min read0
ఏలూరు: అక్టోబర్ పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
తాజా వార్తలుOct 1, 2026

ఏలూరు: అక్టోబర్ పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ఏలూరు జిల్లాలో అక్టోబర్ నెలకు సంబంధించి 2,53,360 మంది పింఛనుదారులకు రూ.111.69 కోట్ల పింఛన్లను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్టోబర్ 1న ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రారంభం కానుండగా, ఆ రోజు తీసుకోని వారికి అక్టోబర్ 2న అందించనున్నారు.

1 min read4
తుఫాన్ ముప్పు.. శ్రీకాకుళం అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
తాజా వార్తలుSep 23, 2026

తుఫాన్ ముప్పు.. శ్రీకాకుళం అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ ముప్పు నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తీర, లోతట్టు ప్రాంతాలపై నిఘా, పునరావాస కేంద్రాల సిద్ధం, మత్స్యకారుల భద్రత, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.

1 min read2
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తాజా వార్తలుSep 23, 2026

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం మళ్లీ రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నిరసన చేపట్టగా, స్పోర్ట్స్ కోటా టీచర్లు కూడా అక్కడికి చేరుకున్నారు. నియామకాల్లో అవకతవకలు, నకిలీ సర్టిఫికెట్లపై వైసీపీ ఆరోపణలు చేస్తుండగా.. తాము మెరిట్, అర్హతలతోనే ఉద్యోగాలు పొందామని టీచర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఉపాధ్యాయులపై భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

1 min read2
RTI దరఖాస్తుల దుర్వినియోగంపై సమాచార కమిషన్ కీలక ఆదేశాలు.. పునరావృత దరఖాస్తులపై స్పష్టత
తాజా వార్తలుSep 19, 2026

RTI దరఖాస్తుల దుర్వినియోగంపై సమాచార కమిషన్ కీలక ఆదేశాలు.. పునరావృత దరఖాస్తులపై స్పష్టత

ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ 102 RTI కేసులను ఒకే బ్యాచ్‌గా విచారిస్తూ, పునరావృత ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే అందించిన సమాచారాన్ని మళ్లీ మళ్లీ కోరడం వల్ల అధికారులపై అనవసర భారం పడుతుందని పేర్కొంది. అలాగే, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని పొందడమే RTI హక్కు పరిధిలోకి వస్తుందని.. కొత్తగా సమాచారం సృష్టించడం, డేటాను విశ్లేషించి నివేదికలు తయారు చేయడం అధికారుల బాధ్యత కాదని స్పష్టం చేసింది.

1 min read1
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. దిగుబడి ఉన్నా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
తాజా వార్తలుSep 17, 2026

Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.. దిగుబడి ఉన్నా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

దేశంలో ఉల్లి ఉత్పత్తి సరిపడా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ధరలు భారీగా పెరగడానికి సీజనల్ సరఫరా అంతరం, పాత రబీ నిల్వలు తగ్గిపోవడం, కొత్త ఖరీఫ్ పంట ఆలస్యం, రవాణా–పంపిణీ సమస్యలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కేంద్రం బఫర్ స్టాక్‌ను రూ.35కే విక్రయిస్తున్నా, ఆ ఉల్లి అన్ని ప్రాంతాలకు సమానంగా చేరకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు అధికంగా కొనసాగుతున్నాయి.

1 min read2
Hanamkonda: హోటల్ అశోక్‌లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. ఫిర్యాదుల నేపథ్యంలో అధికారుల తనిఖీలు
తాజా వార్తలుSep 15, 2026

Hanamkonda: హోటల్ అశోక్‌లో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. ఫిర్యాదుల నేపథ్యంలో అధికారుల తనిఖీలు

హనుమకొండలోని హోటల్ అశోక్‌పై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, ఆహార భద్రత నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించినట్లు సమాచారం. తనిఖీల్లో ఏవైనా ఉల్లంఘనలు గుర్తించారా, నమూనాలు సేకరించారా అనే వివరాలపై అధికారిక నివేదిక రావాల్సి ఉంది.

1 min read2
Nellore: నెల్లూరు రూరల్‌లో టీడీపీ నేతలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ.. లోకేష్ స్వాగత ఏర్పాట్లపై దిశానిర్దేశం
తాజా వార్తలుSep 15, 2026

Nellore: నెల్లూరు రూరల్‌లో టీడీపీ నేతలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి భేటీ.. లోకేష్ స్వాగత ఏర్పాట్లపై దిశానిర్దేశం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ ముఖ్యనేతలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశమయ్యారు. నారా లోకేష్ రేపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి రానున్న నేపథ్యంలో స్వాగత ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉదయం 10.30 గంటలకు లోకేష్‌కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

1 min read4
Naidupeta: నాయుడుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాల ట్యాంకర్ ఢీకొని ఒకరి మృతి
తాజా వార్తలుSep 12, 2026

Naidupeta: నాయుడుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాల ట్యాంకర్ ఢీకొని ఒకరి మృతి

నాయుడుపేట మండలం పండ్లూరు జాతీయ రహదారిపై కిన్నెర 45 హోటల్ కూడలి వద్ద కూలీలతో ఉన్న ఆగి ఉన్న ఆటోను పాల ట్యాంకర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదాలకు ఈ కూడలి కూడా ఒక కారణమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, భద్రతా చర్యలు పెంచాలని కోరుతున్నారు.

1 min read7
Kakinada: సైనైడ్‌తో జగదీశ్వరరెడ్డి హత్య.. పోలీసుల విచారణలో సాధిక్ ఖాన్ సంచలన వాంగ్మూలం
తాజా వార్తలుSep 12, 2026

Kakinada: సైనైడ్‌తో జగదీశ్వరరెడ్డి హత్య.. పోలీసుల విచారణలో సాధిక్ ఖాన్ సంచలన వాంగ్మూలం

కాకినాడ జగదీశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఆస్తి విషయంలో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో జగదీశ్వరరెడ్డిని హత్య చేయాలని ప్రయత్నించినట్లు సాధిక్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో విషప్రయోగానికి ప్రయత్నించడంతో పాటు, అనంతరం సైనైడ్ ఉపయోగించడంతో జగదీశ్వరరెడ్డి మృతి చెందినట్లు నిందితుడు వెల్లడించినట్లు సమాచారం. కేసులో విషపదార్థాల నమూనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1 min read5
రొయ్యల మేత ధరలకు రెక్కలు.. ఆక్వా రైతులపై భారం
తాజా వార్తలుSep 3, 2026

రొయ్యల మేత ధరలకు రెక్కలు.. ఆక్వా రైతులపై భారం

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతులపై సాగు వ్యయం మరింత భారమవుతోంది. రెండు నెలల్లో బ్లాక్ టైగర్ రొయ్యల ఫీడ్ ధర కిలోకు రూ.24 వరకు, వనామీ ఫీడ్ ధర రూ.18 వరకు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. మరోవైపు రొయ్యల మార్కెట్ ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతుల లాభాలపై ఒత్తిడి పెరుగుతోంది. ముడిసరుకుల ధరలు పెరగడమే ఫీడ్ ధరల పెంపునకు కారణమని తయారీదారులు పేర్కొంటుండగా, ధరల నియంత్రణకు శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆక్వా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

1 min read9
సిమెంట్ ధరలకు రెక్కలు.. బస్తాపై రూ.30–40 వరకు పెంపు?
తాజా వార్తలుSep 3, 2026

సిమెంట్ ధరలకు రెక్కలు.. బస్తాపై రూ.30–40 వరకు పెంపు?

సిమెంట్ ధరలు మరోసారి పెరిగే అవకాశం నిర్మాణ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 5 నుంచి ఒక్కో సిమెంట్ బస్తాపై రూ.30 నుంచి రూ.40 వరకు పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాల సమాచారం. ముడిసరుకులు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ పెంపు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గృహ నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

1 min read6
Powered by Vividuss logo